: రెండు రాష్ట్రాల ఉమ్మడి పరీక్షల నిర్వహణపై గవర్నర్ కార్యాలయం వివరణ


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉమ్మడి పరీక్షల నిర్వహణపై గవర్నర్ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన కార్యాలయం, తెలంగాణ ప్రభుత్వ వైఖరికి గవర్నర్ అనుకూలమన్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఇరు రాష్ట్రాల మధ్య ఆమోదయోగ్య పరిష్కారానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని చెప్పింది. రెండు రాష్ట్రాల్లో విద్యార్థులకు మేలు జరగాలన్నదే గవర్నర్ అభిలాష అని పేర్కొంది. తాజాగా ఎంసెట్ ప్రవేశ పరీక్షపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. రెండు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు గవర్నర్ తో చర్చించారు. అయితే తమ పరీక్ష తామే నిర్వహించుకుంటామని, తమ వివరణకు గవర్నర్ సంతృప్తి చెందారని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News