: పోలవరం ఎత్తు పెంపును ఒప్పుకోం: హరీష్ రావు


గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఎత్తును మరింత పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై టీఎస్ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుతో ఇప్పటికే పలు గ్రామాలు మునిగిపోతున్నాయని, ప్రాజెక్టు ఎత్తు ఇంకా పెంచితే మరిన్ని గ్రామాలు ముంపు బారిన పడతాయని అన్నారు. ఏపీ ప్రతిపాదనతో సీతమ్మ ముక్కు వరకు మునిగిపోతుందని తెలిపారు. కుట్రపూరితంగానే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలాంటి ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నారని హరీష్ ఆరోపించారు. దీనిపై అన్ని రకాలుగా పోరాడతామని చెప్పారు.

  • Loading...

More Telugu News