: పవన్ ట్విట్టర్ ఖాతా తెరవడం వెనుక రేణు దేశాయ్!
మీడియాకు, సామాజిక మీడియాకు దూరంగా ఉండే నటుడు పవన్ కల్యాణ్ తాజాగా ట్విట్టర్ ఖాతా తెరిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంత అకస్మాత్తుగా పవన్ సోషల్ మీడియాలోకి ఎలా ప్రవేశించారన్నది ప్రతి ఒక్కరికీ అంతు చిక్కకుండా వుంది. అయితే ఖాతా తెరవడం వెనుక ఆయన మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ ఉన్నట్టు టాక్. పవన్ ఖాతా తెరిచిన రోజే రేణు తన ట్విట్టర్ లో "అవును, నాకు తెలుసు. మొత్తానికి ట్విట్టర్ పై ఆయన కన్విన్స్ అయ్యారు" అని ఓ పోస్టు చేసింది. ఇందుకు పలువురు రీట్వీట్లు చేశారు. అందులో ఓ ట్వీట్ కు రేణు సమాధానమిస్తూ, "కమ్యూనికేషన్ లో సోషల్ మీడియా ప్రాముఖ్యత ఎంతో ఉందని గత మూడు నెలల నుంచి ఆయన్ను నేను కన్విన్స్ చేస్తున్నా" అని పేర్కొంది. అంటే ట్విట్టర్ ప్రారంభం వెనుక రేణు మాటలు పనిచేశాయన్న మాట.