: 12 వేల పరుగుల క్లబ్బులో సంగా


శ్రీలంక క్రికెట్ జట్టుకు మూలస్తంభంగా పరిగణించే వెటరన్ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర (37) మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టెస్టుల్లో 12,000 పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ క్లబ్బులో అడుగుపెట్టాడు. టెస్టుల్లో 12 వేల పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో ఈ దిగ్గజం ఐదో వాడు. న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ లో జరుగుతున్న టెస్టులో ట్రెంట్ బౌల్ట్ విసిరిన బంతికి రెండు పరుగులు తీయడం ద్వారా సంగా ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వారి జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. 200 టెస్టులాడిన సచిన్ 53.78 సగటుతో ఈ పరుగులు సాధించడం విశేషం. ఆ తర్వాత 'టాప్ ఫైవ్' లో రికీ పాంటింగ్ (13,378), జాక్వెస్ కలిస్ (13,289), రాహుల్ ద్రావిడ్ (13,288) ఉన్నారు.

  • Loading...

More Telugu News