: కాకినాడ నుంచి పాండిచ్చేరికి ఇక 'హైలెస్సా'


జాతీయ స్థాయిలో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ క్రమంలో కాకినాడ నుంచి పాండిచ్చేరి వరకు జాతీయ జల రవాణా మార్గం ఏర్పాటు చేసేందుకు కేంద్రం రూ.2500 కోట్లు కేటాయించిందని విశాఖపట్టణం ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తెలిపారు. దీనిపై ఆదివారం విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, రాధాకృష్ణన్ హాజరవుతారని పేర్కొన్నారు. జాతీయ జల రవాణా ప్రాజెక్టుపై ఈ సమావేశంలో చర్చిస్తారని ఆయన తెలిపారు. కాగా, కోల్ కతా నుంచి చెన్నై వరకు బ్రిటీష్ వారి హయాంలో బకింగ్ హాం కాలువ నిర్మిచడం తెలిసిందే. ప్రస్తుతం అది చాలా ప్రాంతాల్లో దెబ్బతిన్నది. పలుచోట్ల భారీగా పూడిక పేరుకుపోయింది. దీన్ని శుభ్రపరిచి రవాణాకు అనువుగా మలచాలని కేంద్రం భావిస్తోంది.

  • Loading...

More Telugu News