: ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన పెను ప్రమాదం


మంగళూరు నుంచి ముంబై మీదుగా ఢిల్లీ వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. 103 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఈ విమానం ముందు అద్దానికి చీలికలు ఏర్పడినట్టు గుర్తించిన పైలట్ వెంటనే ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇవ్వాలని అధికారులను కోరాడు. వారి అనుమతి మేరకు వెంటనే విమానాన్ని కిందకు దించాడు. దీంతో 'హమ్మయ్య' అని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఢిల్లీ నుంచి సాంకేతిక సిబ్బందిని రప్పించి విమానానికి మరమ్మతులు చేపట్టారు. ఈ విమానం గాల్లో మరింత ఎత్తునకు ఎగిరితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News