: ఆ మాత్రం విధ్వంసం చేయలేరా?... కాశ్మీర్లో ప్రశాంత ఎన్నికలపై ఐఎస్ఐ నిరుత్సాహం


జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడంపై పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ నిరుత్సాహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థ లష్కర్-ఏ-తోయిబాపై ఐఎస్ఐ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. కాశ్మీర్లో ఎన్నికలను అడ్డుకోవాలని లష్కర్-ఏ-తోయిబాను ఐఎస్ఐ కోరిందట. అయితే, గట్టి నిఘాను పెట్టిన భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను అడ్డుకున్నాయి. ప్రభుత్వ భవనాలు, రాజకీయ నాయకులను లక్ష్యాలుగా చేసుకొని దాడులు జరపాలని, అందుకోసం 150 మంది ఇండియాలోకి చొరబడాలని ఐఎస్ఐ కోరినట్టు తెలుస్తోంది. వారి యత్నాలు విఫలం కావడాన్ని జీర్ణించుకోలేని ఐఎస్ఐ "ఆ మాత్రం విధ్వంసం చేయలేరా?" అంటూ ఉగ్ర సంస్థపై గుర్రుగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News