: చివరి టెస్టుకు జాన్సన్ డౌటే!


ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ మిచెల్ జాన్సన్ చివరి టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. తొడ కండరాల గాయంతో జాన్సన్ ప్రాక్టీసుకు దూరంగా ఉన్నాడు. సిరీస్ లో చివరిదైన నాలుగో టెస్టు ఈ నెల 6 నుంచి సిడ్నీలో జరగనుంది. కాగా, వచ్చే నెలలో సొంతగడ్డపై జరిగే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని జాన్సన్ ముందు జాగ్రత్తగా విశ్రాంతి కోరుకుంటున్నట్టు అర్థమవుతోంది. జాన్సన్ ఆడని పక్షంలో మరో లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ బరిలో దిగే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News