: క్యాంపస్ నియామకాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ బ్యాంకులు!


ఐటీ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలే కాదు, ప్రభుత్వ బ్యాంకులు కూడా క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు ప్రధాని మోదీని అనుమతి కోరాలని బ్యాంకర్లు నిర్ణయించారు. పూణేలో జరగనున్న రెండు రోజుల పునశ్చరణ, మేధోమథన సదస్సులో భాగంగా, ప్రైవేటు సెక్టార్లోని బ్యాంకుల తరహాలో తాము సైతం క్యాంపస్ నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం నిబంధనలు మార్చాలని విజ్ఞప్తి చేయనున్నారు. ప్రస్తుతం, ప్రతి ఏటా రెండు సార్లు జరిగే ఐబీపీఎస్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థులను బ్యాంకులు తమ అవసరాలను బట్టి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. కాగా, నియామకాల్లో మరింత నైపుణ్యానికి ప్రాధాన్యత ఇచ్చేలా తమకు స్వేచ్ఛ కావాలని బ్యాంకర్లు కోరుతున్నారు.

  • Loading...

More Telugu News