: వేసవి కానుకగా 'రుద్రమదేవి': దర్శకుడు గుణశేఖర్
రాణి రుద్రమదేవి జీవితకథ ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'రుద్రమదేవి' చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేయబోతున్నట్టు దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా వేసవికి వాయిదా వేశామని చెప్పారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారిని కుటుంబసభ్యులతో కలసి ఆయన దర్శించుకున్నారు. తన చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నట్టు అనంతరం మీడియాకు తెలిపారు.