: తెగబడిన పాక్, బుద్ధిచెప్పిన భారత జవాన్లు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ సైన్యం మరోసారి ఉల్లంఘించింది. సాంబా సెక్టార్ లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడగా, భారత బలగాలు వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ కాల్పుల్లో నలుగురు గాయపడ్డట్టు తెలిసింది. నిన్న రాత్రి ప్రారంభమైన కాల్పులు నేటి తెల్లవారుఝాము వరకూ కొనసాగాయి. పాక్ సైన్యం భారత భూభాగంలోని బీఎస్ఎఫ్ స్థావరాల లక్ష్యంగా కాల్పులు జరిపిందని ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కతువా, రాంఘర్, హిరా నగర్ ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరిగినట్టు ఆయన వివరించారు.