: తెలంగాణలో రూ.1000 కోట్ల రికార్డు స్థాయి మద్యం అమ్మకాలు


2014 చివరి నెలలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. డిసెంబర్ 31 నాటి రాత్రి జరిగిన నూతన సంవత్సరం వేడుకలతో కలిపి మొత్తం రూ.1005 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 2013 డిసెంబర్ లో మద్యం అమ్మకాలతో పోలిస్తే, ఇది 15.25 శాతం అధికం. 2013 డిసెంబర్‌లో తెలంగాణలోని పది జిల్లాల్లో మొత్తం రూ.872 కోట్ల మేర అమ్మకాలు జరగ్గా, ఈసారి అది రూ.1000 కోట్ల మార్కును దాటడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా రూ.244.80 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగ్గా, రూ.163.36 కోట్ల అమ్మకాలతో హైదరాబాద్ రెండోస్థానంలో నిలిచింది. నిజామాబాద్‌ జిల్లాలో కనిష్ఠంగా రూ.50.64 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. కాగా, ఆంధ్రప్రదేశ్ లో రూ.995 కోట్ల విలువచేసే మద్యం అమ్మకాలు ఈ డిసెంబర్ లో నమోదయ్యాయి.

  • Loading...

More Telugu News