: ఫేస్ బుక్ లో 'బాస్' కు నో ఎంట్రీ!


సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో 'ఎవరికైనా ఓకే' గానీ ఆఫీసు బాస్ కు మాత్రం యువత 'నో ఎంట్రీ' అనే చెబుతుందట. ఓ సర్వేలో వెల్లడైన ఆశ్చర్యకర విషయమిది. రెండు వెబ్ సైట్లు మొత్తం 722 మందిపై సర్వే నిర్వహించగా.. 81 శాతం మంది బాస్ తో ఆన్ లైన్ స్నేహం చేసేందుకు ససేమిరా అన్నారట. ఫేస్ బుక్ లో బాస్ కు ఎంట్రీ ఇస్తే వ్యక్తిగత విషయాలు బాస్ కు తెలియనుండడమే వీరి అభ్యంతరానికి కారణమని సర్వే చెబుతోంది. ఇక కొలీగ్స్ తో స్నేహం చేసేందుకు 55 శాతం మంది మొగ్గు చూపగా, 45 శాతం మంది బయటి వ్యక్తులతో చెలిమి చేయడమే ఇష్టమంటున్నారట.

  • Loading...

More Telugu News