: చివరి టెస్టుకు స్టాండ్‌ బైగా ధోనీ... అవసరమైతే సేవలు: రవి శాస్త్రి


అవసరమైతే ఆస్ట్రేలియాతో జరిగే చివరి టెస్టుకు ధోనీ స్టాండ్‌ బైగా ఉంటాడని, అత్యవసరమైతే జట్టుకు అతడి సేవలు అందుతాయని భారత క్రికెట్ జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి తెలిపారు. ఇటీవల టెస్ట్ కెరీర్‌ కు వీడ్కోలు పలికిన ధోనీ స్వదేశానికి వెళ్లి ముక్కోణపు సిరీస్ మొదలయ్యేలోగా తిరిగి ఆస్ట్రేలియా చేరుకుంటాడని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ధోనీ ఆస్ట్రేలియాలోనే ఉంటాడని స్పష్టం చేసిన ఆయన, వృద్ధిమాన్ సాహా వికెట్‌ కీపింగ్ బాధ్యతలు నిర్వహిస్తాడని తెలిపారు. చివరి టెస్టు మొత్తంలో ఎప్పుడైనా అత్యవసరమైతే ధోనీ సేవలు అందిస్తాడని వివరించాడు.

  • Loading...

More Telugu News