: తెలియని దైవం కన్నా తెలిసిన దయ్యమే మేలట!


అధ్యక్ష ఎన్నికల వేడి శ్రీలంకలో బాగా రాజుకుంది. అధ్యక్షుడు మహింద రాజపక్స ఎన్నికల్లో నెగ్గేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో జాఫ్నాలో జరిగిన ఎన్నికల సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలియని దైవం కన్నా తెలిసిన దయ్యమే మేలని అన్నారు. తాను తెలిసిన దయ్యాన్నే అని, తమిళులందరూ తనకే ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి గెలిపిస్తే అన్ని సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. జాఫ్నా ప్రాంతంలో తమిళ జనాభా ఎక్కువ.

  • Loading...

More Telugu News