: బీరు క్యాన్ పై మహాత్ముడి బొమ్మ... లాయర్ల మండిపాటు
మహాత్మా గాంధీని భారతీయులు జాతిపితగా భావిస్తారు. ఆయన ఔన్నత్యం అలాంటిది. దేశం కోసం చివరి వరకు పాటుపడిన వ్యక్తిగా ఆ మహనీయుడి ఖ్యాతి విశ్వవ్యాప్తం. కానీ, ఇంగ్లాండ్ కు చెందిన న్యూ ఇంగ్లండ్ బ్రూయింగ్ కంపెనీ అనే మద్యం తయారీ సంస్థ బీరు క్యాన్ పై మహాత్ముడి బొమ్మ ముద్రించింది. దీనిపై రంగారెడ్డి జిల్లా న్యాయవాదులు జనార్థన్ గౌడ్, గోవర్థన్ రెడ్డి అనే న్యాయవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ సైబరాబాద్ 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. బీరు టిన్నుపై గాంధీ బొమ్మ ముద్రించడం భారతీయులను అవమానించడమేనంటూ మండిపడ్డారు.