: ఏపీలో రూ.150కే ఇంటింటికీ ఇంటర్నెట్


ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోదించారు. దీంతో, రాష్ట్రంలోని 1.30 కోట్ల కుటుంబాలకు నెలకు రూ.150కే ఇంటర్నెట్ (10-15 ఎంబీపీఎస్ వేగం) సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ పథకం అమలు చేయనున్నారు. ఏపీని సాంకేతిక రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతోనే ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

  • Loading...

More Telugu News