: 'ఎయిర్ ఏషియా' గాలింపు చర్యలకు వాతావరణం అడ్డంకి
ఇండోనేషియాలోని సురబయ నుంచి సింగపూర్ వెళ్లే క్రమంలో జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ఏషియా విమానం క్యూజెడ్-8501 గాలింపు చర్యలకు ప్రతికూల వాతావరణం అడ్డంకిగా నిలుస్తోంది. విమానం కూలిన ప్రాంతం ప్రస్తుతం భారీ అలలు, తీవ్ర గాలులతో అల్లకల్లోలంగా ఉందని ఇండోనేషియా నేషనల్ రెస్క్యూ సంస్థ చీఫ్ బ్యాంబాంగ్ తెలిపారు. కాగా, ఇప్పటివరకు 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలు విమానం కూలిపోయిన ప్రాంతం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నట్టు తెలుస్తోంది.