: భర్త గుట్టు విప్పేసిన భార్యామణి!
భర్త చేసే తప్పులను భార్యలు వ్యతిరేకించినా, అది చాలా సందర్భాల్లో ఇంటివరకే పరిమితం! కానీ, ఈ మహిళ తన భర్త అక్రమ సంపాదన వివరాలను యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులకు తెలిపి, అతడిపై కేసు నమోదవ్వడానికి కారణమైంది. వివరాల్లోకెళితే... గుజరాత్ లోని బొటద్ జిల్లాలో కమలేశ్ గోర్దియా డిప్యూటీ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అవినీతి ఆర్జన రూ.కోటి దాటింది. ఈ నేపథ్యంలో, అతడి భార్య ఓ దరఖాస్తులో భర్త మహాశయుడు ఎక్కడెక్కడ ఏమి కూడబెట్టాడో వివరంగా పేర్కొంది. దీన్ని పరిశీలించిన ఏసీబీ అధికారులు కమలేశ్ పై ఫిర్యాదును నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. కమలేశ్ మొత్తం రూ.1.04 కోట్లు వెనకేశాడు. అక్రమార్జనతో రూ.68 లక్షల విలువ చేసే బాండ్లు, రూ.32 లక్షల విలువ చేసే ఇల్లు, రూ.1.22 లక్షల విలువ చేసే భూమి తదితర ఆస్తులు కొనుగోలు చేశాడు.