: ట్విట్టర్లో విరాట్ ప్రభంజనం...సచిన్ ను దాటేశాడు!
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ మైదానంలోనే కాదు సోషల్ మీడియాలోనూ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. బ్యాట్ తో పరుగులు వెల్లువెత్తించే ఈ ఢిల్లీ కుర్రాడు ట్విట్టర్లోనూ దూసుకుపోతున్నాడు. ఈ మైక్రో బ్లాగింగ్ సైట్ లో 50 లక్షల మంది ఫాలోయర్లను సంపాదించుకున్న తొలి క్రికెటర్ గా అవతరించాడు. ఇప్పుడతన్ని ట్విట్టర్లో అనుసరిస్తున్న వారి సంఖ్య 50,04,544. ఈ విషయంలో కోహ్లీ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ను అధిగమించాడు. సచిన్ ను ట్విట్టర్లో 49,10,498 మంది అనుసరిస్తున్నారు. దీనిపై కోహ్లీ స్పందిస్తూ, తనను ఫాలో అవుతున్నవారికి కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ, సచిన్ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ (32 లక్షలు), యువరాజ్ సింగ్ (27 లక్షలు), సురేశ్ రైనా (26 లక్షలు), జహీర్ ఖాన్ (17 లక్షలు), గౌతమ్ గంభీర్ (16.5 లక్షలు), రోహిత్ శర్మ (16.2 లక్షలు) ఉన్నారు.