: ఢిల్లీలో మరో పదిమంది ఉన్నారా?
గుజరాత్ లోని పోరుబందర్ కు 360 కిలోమీటర్ల దూరంలో పాకిస్థాన్ ఉగ్రవాదుల మరపడవ పేలిపోవడంతో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేశాయి. సంక్రాంతి, రిపబ్లిక్ డే సందర్భంగా దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచించాయని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో పది మంది ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గుర్ గావ్ లో దొరికిన ఇద్దరు తీవ్రవాదులను విచారిస్తున్నారు. అలాగే స్లీపర్ సెల్స్ గా ఉన్న తీవ్రవాదుల వివరాలు తెలుసుకునేందుకు భద్రతాధికారులు మరోసారి పట్టుబడ్డ తీవ్రవాదులను విచారిస్తున్నారు.