: భూసేకరణలో పారదర్శకత బాధ్యత జేసీలదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కోసం జరుపుతున్న భూసేకరణలో పారదర్శకత బాధ్యతను జాయింట్ కలెక్టర్లకు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూసేకరణ, పరిహారం, పునరావాసంలో పారదర్శకత కోసం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం 24 మంది జేసీలను గుంటూరు జిల్లాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఏపీలోని గ్రామాల్లో 4జీ సేవల కోసం యూనిట్ ధరను నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.