: నీటిలోనూ, నేల మీద మంటలు... బెంబేలెత్తిన స్థానికులు
నీటిలోనూ, నేల మీద ఉన్నట్టుండి మంటలు లేవడం ఎప్పుడైనా చూశారా? ఝార్ఖండ్ లోని బొకారో జిల్లాలోని చందన్ క్యూవరి గ్రామంలోని చెరువు, పొలాల్లో ఒక్కసారిగా మంటలు లేచాయి. దీంతో తీవ్ర భయాందోళనలకు లోనైన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలిని పరిశీలించిన అధికారులు అక్కడ మీథేన్ వాయువు వెలువడుతున్నట్టు గుర్తించారు. చెరువులోని నీటిపై వెలువడుతున్న మంటలను స్థానికులు భయాందోళనల నడుమ వీక్షించారు.