: కోహ్లీ టీమిండియా శైలిని మార్చేస్తాడు: జాన్సన్
ప్రస్తుత సిరీస్ లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో మాటల యుద్ధం జరుపుతున్న ఆసీస్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ తాజాగా మీడియాతో మాట్లాడాడు. కోహ్లీ సారథ్యంలో టీమిండియా దూకుడు సంతరించుకుంటుందని అభిప్రాయపడ్డాడు. సాధారణంగా భారత్ ఆటతీరు దూకుడుగా ఉండదని, అయితే, కోహ్లీ టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం ఆసక్తి కలిగిస్తోందని అన్నాడు. అతను ఎప్పుడూ ఆవేశంగా కనిపిస్తాడని, తప్పకుండా ఆటలోనూ దూకుడైన ఫీల్డింగ్ అమరికలు ఏర్పాటు చేస్తాడని భావిస్తున్నట్టు ఈ లెఫ్టార్మ్ స్పీడ్ స్టర్ పేర్కొన్నాడు. ధోనీ కంటే కోహ్లీ ఎంతో విభిన్నమన్న విషయాన్ని గుర్తిస్తారని తెలిపాడు.