: ఆయనే హాట్... ఆయన తరువాతే హృతిక్: బిపాసా బసు
వయసు పైబడినా ఇప్పటికీ హాటెస్ట్ మ్యాన్ అమితాబ్ బచ్చనే అని బాలీవుడ్ అందాలతార బిపాసాబసు తేల్చిచెప్పింది. డినోమోరియా, జాన్ అబ్రహాంతో సహజీవనం చేసిన బిపాసా వారిద్దరినీ మర్చిపోయినట్టుంది. 'ఎలోన్' సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ టీవీషోలో మాట్లాడుతూ, అమితాబ్ తరువాతే ఎవరైనా అని పేర్కొంది. హాటెస్ట్ హీరోగా బచ్చన్ సర్ కి పదికి పది మార్కులు ఇవ్వవచ్చని చెప్పింది. అలాగే హృతిక్ రోషన్ కి కూడా పది మార్కులు వేయొచ్చని తెలిపింది. అనిల్ కపూర్ కి ఏడు మార్కులేసింది.