: ముగ్గురు చిన్నారుల ప్రాణం తీసిన గాలిపటం సరదా


కరెంటు వైర్లకు చిక్కుకున్న గాలిపటాన్ని తొలగించబోయి ముగ్గురు చిన్నారులు దుర్మరణం పాలైన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. పామర్రు మండలం రాజుహరిగోపాల్ నగర్ లో ఏసురాజు (11), జాన్ బాబు (9), సురేశ్ (12) అనే చిన్నారులు విద్యుత్ లైన్ కు చిక్కుకున్న గాలిపటాన్ని ఓ ఇనుపరాడ్డు సాయంతో తీసేందుకు ప్రయత్నించారు. అయితే, కరెంటు షాక్ కొట్టడంతో వారు ముగ్గురు ప్రాణాలు విడిచారు. దీంతో, వారి కుటుంబాలతో పాటు గ్రామంలో విషాదం నెలకొంది. ఏసురాజు, జాన్ బాబు అన్నదమ్ములు కాగా, సురేశ్ తన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

  • Loading...

More Telugu News