: ఆ విమానం నీటిపై సురక్షితంగా దిగిందా?


జావా సముద్రంలో మునిగిపోయిన ఎయిర్ ఏషియా విమానం కుప్పకూలలేదా? విమానాన్ని పైలట్ సురక్షితమైన స్థితిలోనే నీటిపై దించాడా? అనే అనుమానాలు నిపుణుల మదిలో రేగుతున్నాయి. ఎయిర్ ఏషియాకు చెందిన క్యూజెడ్ 8501 విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా పైలట్ నీటిపై ల్యాండ్ చేసి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమానం కుప్పకూలితే శకలాలు కనిపించాలి. కానీ, అక్కడ అవేవీ కనిపించలేదు. విమానాన్ని పైలట్ సురక్షితంగా నీటిపై ల్యాండ్ చేసి ఉంటాడని, ఉవ్వెత్తున ఎగసిపడే అలలు విమానాన్ని అతలాకుతలం చేసి, దాని మునకకు కారణమై ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. కాగా, బ్లాక్ బాక్స్ కోసం గాలింపు జరుగుతోంది.

  • Loading...

More Telugu News