: 'స్లెడ్జింగ్ లో దిట్టనే' అంటున్న ఆసీస్ ప్రధాని!
ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ ఆసీస్, భారత్ జట్లకు గురువారం నాడు తన నివాసంలో టీ పార్టీ ఇచ్చారు. ఈ విందుకు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని అబాట్ క్రికెటర్లతో సరదాగా మాట్లాడారు. తనకు బ్యాటింగ్ చేయడం రాదని, బంతి విసరలేనని, ఫీల్డింగ్ చేయలేనని, అయితే, స్లెడ్జింగ్ (మాటల యుద్ధం) మాత్రం చేయగలనని చెప్పారు. స్లెడ్జింగ్ లో తాను దిట్టనని, ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ జట్టులో చోటు కోసం ఆ అంశంలో తగిన ప్రావీణ్యం ప్రదర్శించేవాడినని గుర్తు చేసుకున్నారు. జట్టులో కూడా తనకు స్లెడ్జింగ్ ప్రాతిపదికనే స్థానం కల్పించేవారని భావిస్తున్నట్టు తెలిపాడు. అబాట్ ఆక్స్ ఫర్డ్ వర్శిటీ అనుబంధ క్వీన్స్ కాలేజీ కామన్ రూం టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించారు.