: బ్యాడ్ లక్ తోనే కేన్సర్ సోకుతుందట: హాప్ కిన్స్ స్టడీ వెల్లడి


ప్రాణాంతకంగా పరిణమిస్తున్న కేన్సర్ కారకమేమనుకుంటున్నారు? దురలవాట్లు, జీవన విధానం, ఆహార్యం, వంశపారంపర్య జన్యువులు... ఇవేవీ కావంటున్నారు హాప్ కిన్స్ కిమ్మెల్ కేన్సర్ సెంటర్ పరిశోధకులు. ఇటీవల వీరు చేపట్టిన ఓ అధ్యయనం మనందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తే అంశాన్ని వెల్లడించింది. కేవలం బ్యాడ్ లక్ కారణంగానే కేన్సర్ సోకుతుందని సదరు అధ్యయనం వెల్లడించింది. కణాల విభజన క్రమంలో అనుకోని పరివర్తనల నేపథ్యంలోనే కేన్సర్ సోకుతుందని ఆ అధ్యయనం తెలిపింది. బ్యాడ్ లక్, వాతావరణ పరిస్థితులు, వంశపారంపర్యం సమ్మేళనంతోనే కేన్సర్ వ్యాధి సోకుతున్నట్లు తమ పరిశోధనల్లో వెల్లడైందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన హాప్ కిన్స్ శాస్త్రవేత్త బెర్ట్ వొగెల్ స్టీన్ చెప్పారు. ‘సైన్స్’ జర్నల్ లో ఈ పరిశోధన సారాంశం ప్రచురితమైంది.

  • Loading...

More Telugu News