: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సకు మరో షాక్
శ్రీలంక దేశ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 8న జరుగుతాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రస్తుత అధ్యక్షుడు మహీంద రాజపక్స బలాన్ని కోల్పోతున్నారు. తాజాగా, ఆయన కేబెనెట్ లోని మరో మంత్రి విపక్షంలో చేరిపోయారు. ఉన్నత విద్యా శాఖ డిప్యూటీ మంత్రి నందిమిత్రా ఏకనాయకే అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మైత్రిపాల సిరిసేనకు మద్దతు పలికారు. ఇటీవలి కాలంలో అధికార పక్షం నుంచి ప్రత్యర్థి శిబిరంలోకి జంప్ అయిన 25వ అధికార పక్ష నేత ఏకనాయకే. దేశానికి మంచి భవిష్యత్తు అందించాలన్న ఉద్దేశంతోనే రాజపక్స నేతృత్వంలోని ఫ్రీడం పార్టీకి రాజీనామా చేసినట్టు ఏకనాయకే తెలిపారు.