: హౌరా రైల్వే స్టేషన్ లో మరో ఇద్దరు తీవ్రవాదుల అరెస్ట్
నేడు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలపై పోలీసులు నిఘా పెంచారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేసిన మరుక్షణమే పశ్చిమ బెంగాల్ పోలీసులు మరో ఇద్దరు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. హౌరా పోలీస్ స్టేషన్ పై నిఘా పెంచిన పోలీసులు కొద్దిసేపటి క్రితం ఇద్దరు తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరిని ఉల్ఫా తీవ్రవాదులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే, నోయిడాలో పట్టుబడ్డ ఇద్దరు ఉగ్రవాదులకు పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపిన బుర్ద్వాన్ ఘటనతో సంబంధముందా? అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.