: మెట్రో రైలు ప్రాజెక్టును సమీక్షించిన తెలంగాణ సీఎస్


హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షకు ఎల్ అండ్ టీ ఛైర్మన్ గాడ్గిల్ తో పాటు పలువురు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా, మెట్రో రైలు పనులు, సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని రాజీవ్ శర్మ తెలుసుకున్నారు. ఈ సమీక్షకు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఇటీవల కాలంలో టీఎస్ ప్రభుత్వానికి, మెట్రో నిర్మాణ పనులను చేపట్టిన ఎల్ అండ్ టీ సంస్థకు మధ్య పలు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News