: నవ్యాంధ్ర రాజధానికి ప్రపంచంలోనే గుర్తింపు తెస్తాం: గల్లా జయదేవ్
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానికి ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రాజధాని నిర్మాణంలో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నామని ఆయన ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధానికి కేవలం 15 వేల ఎకరాలు సరిపోతాయన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. రాజధాని అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే కాదని ఆయన వ్యాఖ్యానించారు. మెరుగైన ప్రజా జీవనానికి కూడా అద్దం పట్టేలా ప్రజా రాజధాని ఉండబోతోందన్నారు. ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేలా ప్రజా రాజధాని నిర్మాణం జరగనుందని ఆయన వెల్లడించారు.