: కదులుతున్న ట్రైన్ నుంచి రైల్వే పోలీసులను నెట్టేశారు!
బీహార్లో కొందరు దుండగులు నడుస్తున్న ట్రైన్ నుంచి ఇద్దరు రైల్వే పోలీసులను నెట్టివేశారు. వివరాల్లోకెళితే... ఫరక్కా ఎక్స్ ప్రెస్ లో సదరు రైల్వే కానిస్టేబుళ్లు భద్రత విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో కొందరు దుండగులు కంపార్ట్ మెంట్లో భారీగా లూటీకి పాల్పడి పరారయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో డోర్ వద్ద కానిస్టేబుళ్లు అడ్డగించడంతో అక్కడ ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో, ఆ దుండగులు పోలీసులను రైల్లోంచి కిందికి తోసివేయడంతో, ఓ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. మరో పోలీసు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.