: రాజధాని భూసేకరణకు నేలపాడులో నోటిఫికేషన్ జారీ


నవ్యాంధ్రపదేశ్ నూతన రాజధాని ప్రాంతంలో భూసేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. తుళ్లూరు మండలంలోని నేలపాడు గ్రామంలో భూసేకరణకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నేలపాడు గ్రామ పరిధిలోని 1,409.25 ఎకరాల భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఉదయం 10 గంటల నుంచి స్థానిక పంచాయతీ కార్యాలయంలో రైతుల నుంచి సమ్మతి పత్రాలను స్వీకరిస్తున్నారు.

  • Loading...

More Telugu News