: మృత్యువుతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన ప్రియాంకచోప్రా డిజైనర్


బాలీవుడ్ లో కొత్త సంవత్సరం విషాదాన్ని నింపింది. ప్రముఖ నటి ప్రియాంకచోప్రా నటించిన మేరీకోమ్ చిత్రానికి కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసిన ఇషా మంత్రి (27) విషాద స్థితిలో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే, డిసెంబర్ 29న గోవా బీచ్ లోని ఎలక్ట్రానిక్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో స్టేజ్ పై నుంచి కిందపడ్డ ఇషా తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించగా... అక్కడ మృత్యువుతో పోరాడుతూ ఆమె ప్రాణాలు వదిలారు. స్టేజ్ మీద నుంచి కిందకు పడిపోయిన సమయంలో ఇషా మోతాదుకు మించి మద్యపానం సేవించారని గోవా టూరిజం మినిస్టర్ దిలీప్ పారులేకర్ వెల్లడించారు. ఇష మృతిపై బాలీవుడ్ సంతాపం వ్యక్తం చేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఇష, చిన్న వయసులోనే మరణించడం బాధాకరంగా ఉందని ప్రముఖ నటి, దర్శకురాలు పూజాభట్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News