: పాట కచ్చేరిలో స్టెప్పులేసిన మహిళా ఎంపీడీవో
నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా నిర్వహించిన పాట కచ్చేరిలో మహిళా ఎంపీడీవో స్టెప్పులేసి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేశారు. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు స్థానిక ఆర్ అండ్ బీ అతిథిగృహంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎస్ పురం ఎంపీడీవో మహాలక్ష్మి కూడా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా పాట కచ్చేరి ప్రారంభం కాగానే... తాను కూడా ఉల్లాసంగా స్టెప్పులేశారు. దీంతో, అక్కడున్న వారందరూ ఓ క్షణం ఆశ్చర్యానికి లోనయినప్పటికీ, ఆ తర్వాత అందరూ ఆమెతో పాటు కాలు కదిపారు.