: ఏరియల్ సర్వేలో కేసీఆర్ కు కరవు కనిపించలేదా?: జీవన్ రెడ్డి
హెలికాప్టర్ ద్వారా వరుసగా ఏరియల్ సర్వేలు నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీ.కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి విమర్శనాస్త్రాలు గుప్పించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు కరవుతో అల్లాడుతున్నారని వార్తలు వస్తున్నా, ప్రభుత్వం మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదని ఆరోపించారు. ఏరియల్ సర్వేలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరవు పరిస్థితులు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణను కరవు రాష్ట్రంగా ప్రకటించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన రుణ ప్రణాళికలు కూడా ఇంత వరకు అమలు కాలేదని మండిపడ్డారు.