: కేసీఆర్... ఏసు పంపిన దైవదూత: డిప్యూటీ సీఎం రాజయ్య


తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య కొత్త తరహాలో అభివర్ణించారు. కేసీఆర్ ను ఏసుక్రీస్తు దూతగా పేర్కొన్న ఆయన, తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చేందుకు యేసు క్రీస్తు, కేసీఆర్ రూపంలో తన దూతను పంపారని తెలిపారు. మెదక్ జిల్లా పటాన్ చెరు మండలంలోని ముత్తంగి డివైన్ చర్చిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు హాజరైన సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ప్రజలను ఉద్ధరించేందుకు ఆ ఏసు ప్రభువే కేసీఆర్ ను తన దూతగా పంపించాడు. ప్రజల కష్టాలను తీర్చే బాధ్యత కేసీఆర్ తన భుజస్కందాలపై వేసుకున్నారు’’ అని రాజయ్య అన్నారు. అట్టడుగు వర్గానికి చెందిన తనకు డిప్యూటీ సీఎం పదవి దక్కడం కూడా యేసు క్రీస్తు చలవేనని కూడా రాజయ్య ప్రకటించారు.

  • Loading...

More Telugu News