: అన్నయ్య కల నెరవేర్చాం...కల్యాణ్ అన్నయ్య ఇలాగే ఉండాలి: జూనియర్ ఎన్టీఆర్
జానకీరాం అన్నయ్య కల నెరవేరిందని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. హైదరాబాదులో పార్క్ హయాత్ లో పటాస్ ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, 'కల్యాణ్ అన్నయ్య- నేను ఒక వేదికపై నిలబడి మాట్లాడాలని జానకీరామ్ అన్నయ్య కలకన్నారు. ఇప్పుడది నిజమైంది' అన్నారు. అన్నయ్య ఎప్పుడైనా పైచేయిగానే ఉన్నారని, ఇకపై కూడా అలాగే ఉంటారని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన తెలిపారు.