: కేరళలో మహిళా ఉద్యోగుల తనిఖీల దుమారం
కేరళలోని కొచ్చిలో తనిఖీల దుమారం రేగుతోంది. కొచ్చి శివారులోని ఓ సర్జికల్ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది మహిళా ఉద్యోగులను అదే కంపెనీకి చెందిన ముగ్గురు మహిళా సూపర్ వైజర్లు బట్టలు విప్పి తనిఖీ చేశారు. దీనిపై మహిళా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కలకలం రేగింది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. తనిఖీలు చేసిన ముగ్గురు మహిళా సూపర్ వైజర్లను కంపెనీ యాజమాన్యం సస్పెండ్ చేసింది.