: ఏపీ రాజధాని 122 చదరపు కిలోమీటర్లు...జీవో విడుదల
122 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా గుర్తించినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. దీనితో పాటు, అదనంగా 7068 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని అభివృద్ధి ప్రాంతంగా గుర్తించామని ఏపీ పేర్కొంది. రాజధాని ల్యాండ్ పూలింగ్ పై రూపొందించిన మార్గదర్శకాలపై జీవో విడుదల చేసింది. విజయవాడ-గుంటూరు మధ్య గ్రీన్ ఫీల్డ్స్ రాజధాని నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపింది. రాజధాని నిర్మాణంతో పాటు మూడు మెగా సిటీలను రూపొందిస్తామని, ఏపీలో 14 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని జీవోలో పేర్కొంది. కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల మేరకు ల్యాండ్ పూలింగ్ చేపడతామని జీవోలో స్పష్టం చేసింది. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేసేందుకు మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేశామని జీవోలో వెల్లడించారు. ప్రణాళిక, సమన్వయం, అమలు, పర్యవేక్షణ, నిధులు, ప్రమోటింగ్ కోసం సీఆర్డీఏ ఏర్పాటు చేసినట్టు జీవోలో పేర్కొన్నారు.