: తీవ్రవాది లఖ్వీకి జ్యుడీషియల్ కస్టడీ
ముంబయి పేలుళ్ల ప్రధాన సూత్రధారి జకీర్ రెహ్మన్ లఖ్వీకి ఇస్లామాబాద్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. తాజాగా నమోదు చేసిన కిడ్నాప్ కేసులో 14 రోజుల రిమాండ్ కు పంపింది. ఉగ్రవాద వ్యతిరేక కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేయడంపై పాక్ ప్రభుత్వం ఈరోజు సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వెంటనే అతడిని రిమాండ్ కు పంపడం గమనార్హం.