: ఎయిమ్స్ లో ఆశారాం బాపుకు వైద్య పరీక్షలు
ఓ అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. జోధ్ పూర్ అత్యాచారం కేసులో కొన్నాళ్లుగా జైల్లో ఉంటున్న ఆశారాం, ఆరోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ లో కోరాడు. దాంతో, ఓ వైద్య బోర్డు ఏర్పాటుచేసి ఆశారాంకు పరీక్షలు నిర్వహించి, ఆ నివేదికలను పరిశీలించాలని గతేడాది అక్టోబర్ లో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో డిసెంబర్ 3న పరీక్షలు నిర్వహించాలని కోర్టు తెలిపింది. అయితే, తనను రోడ్డు మార్గంలో తీసుకువెళ్లేందుకు ఆశారాం నిరాకరించడంతో వైద్య పరీక్షల ప్ర్రక్రియ వాయిదాపడింది. మళ్లీ ఈరోజు కట్టుదిట్టుమైన భద్రతతో పోలీసులు ఆశారాంను ఎయిమ్స్ కు తీసుకువచ్చి వైద్య పరీక్షలు చేయించారు.