: బీబీసీ యాంకర్ తో పెళ్లి వార్తను ఖండించిన ఇమ్రాన్ ఖాన్


బీబీసీ మాజీ యాంకర్ రెహామ్ ఖాన్ ను తాను రహస్యంగా వివాహం చేసుకున్నట్టు పాక్ మీడియాలో వచ్చిన వార్తలను తెహ్రిక్ ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. ఇది గొప్ప అతిశయోక్తి అని పేర్కొన్నారు. ఈ మేరకు తన పెళ్లి పుకార్లను ఈ మాజీ క్రికెటర్ ట్విట్టర్లో కొట్టిపారేశారు. మరోవైపు, ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ ఈ విషయంపై మాట్లాడుతూ, రాజకీయ ప్రత్యర్థుల దుష్ప్రచారంలో తన సోదరుడు బాధితుడయ్యాడని అంటోంది. అయితే, ఇమ్రాన్ సరైన వ్యక్తిని వివాహం చేసుకుని జీవితంలో స్థిరపడితే తమ కుటుంబం చాలా సంతోషిస్తుందని తెలిపింది.

  • Loading...

More Telugu News