: కోటి విలువైన డైమండ్స్, బంగారం, నగదు అపహరణ
హైదరాబాదులో భారీ చోరీ జరిగింది. కొత్త సంవత్సర వేడుకలు జరుగుతుండగానే దొంగలు కోటి విలువైన సరంజామా ఎత్తుకుపోయారు. లంగర్ హౌస్ లోని సాలార్ జంగ్ కాలనీలో ప్రముఖ వ్యాపారి సుమిత్ అగర్వాల్ నివాసంలో చొరబడిన దొంగలు సుమారు కోటి రూపాయల విలువైన వజ్రాలు, బంగారం, నగదు దోచుకునిపోయారు. దొంగతనం జరిగిన విషయం గుర్తించిన సుమిత్ అగర్వాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.