: రూ. 2 తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... అర్థరాత్రి నుంచి అమల్లోకి
కొత్త సంవత్సరం తొలి రోజున భారతీయులకు తీపి కబురు. పెట్రో ఉత్పత్తుల ధరలు మరోసారి తగ్గాయి. డీజిల్, పెట్రోల్ ధరలను లీటర్ కు రూ.2 మేరకు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వరంగ చమురు సంస్థలు నేటి మధ్యాహ్నం ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర భారీగా పతనమవుతున్న సంగతి తెలిసిందే. ఒక దశలో 130 డాలర్లకు పైగా ఉన్న బ్యారల్ క్రూడాయిల్ ధర ప్రస్తుతం 55 డాలర్లకు పడిపోయింది. కాగా, మారిన ధరలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ధరల సవరణ తరువాత హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ.67.02 నుంచి రూ.65.02కు తగ్గనుంది. నేటి ఉదయం సబ్సీడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.43.50 మేర తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.