: మార్స్ ఆర్బిట్ లో 'మంగళయాన్' సెంచరీ
కొత్త ఏడాది తొలిరోజున భారతీయ అంతరిక్ష నౌక 'మంగళయాన్' అంగారక గ్రహ కక్ష్యలో వంద రోజులు పూర్తి చేసుకుందని ఇస్రో తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 24న అంగారక కక్ష్యలోకి ఈ నౌక విజయవంతంగా ప్రవేశించింది. దాంతో, భారత్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిన దేశంగా నిలిచింది. ఇస్రో అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ, ఉపగ్రహం సవ్యంగానే పనిచేస్తోందన్నారు. ఈ ప్రయోగంలో విజయాలు, నేర్చుకున్న పాఠాలను విశ్లేషించేందుకు ఈ రోజు స్పేస్ ఏజెన్సీ ఓ సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు.