: దేశ రాజధానిలో 17 ఏసీ బస్సులు దగ్ధం
దేశరాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంబేద్కర్ నగర్ డిపోలో సంభవించిన ఈ ప్రమాదంలో ఢిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ కు చెందిన 17 ఏసీ బస్సులు దగ్ధమయ్యాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు వివరించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.