: 'మిస్ అమెరికా'నే... కానీ, విజయవాడ అమ్మాయిని: నీనా


తాను 'మిస్ అమెరికా' అయినప్పటికీ విజయవాడ అమ్మాయినేనని మిస్ అమెరికా నీనా దావులూరి పేర్కొంది. విజయవాడకు ఐదేళ్ల విరామం తరువాత వచ్చానని నీనా తెలిపింది. బాల్యం ఇక్కడే గడిచిందని చెప్పింది. ఈ ఐదేళ్లలో విజయవాడలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పింది. ఎన్నో వేసవికాలాలు విజయవాడలోనే గడిచాయని తెలిపింది. విజయవాడ మండుటెండల్లో తిరిగేదాన్నని నీనా పేర్కొంది. ఇక్కడే కూచిపూడి నేర్చుకున్నానని వెల్లడించింది. భారత సంస్కృతి సంప్రదాయాలే తనను 'మిస్ అమెరికా'గా నిలిపాయని నీనా వివరించింది. తాను 'మిస్ అమెరికా'గా విజయం సాధించగానే జాత్యహంకార వ్యాఖ్యలు చేశారని, అంతకంటే ఎక్కువ మంది తనను అభినందించారని నీనా తెలిపింది. 'మిస్ అమెరికా' అంటే గ్లామర్ కాదని, పలు సేవా కార్యక్రమాలు చేసే యువతి అని నీనా చెప్పింది. కొద్ది రోజుల్లో తన బాధ్యత పూర్తవుతుందని, ఆ తరువాత భారత్ లోని పలు సంస్థలతో కలిసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని 'మిస్ అమెరికా 2014' విజేత నీనా దావులూరి పేర్కొంది.

  • Loading...

More Telugu News